POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 1:36 pm Posted by : POLITICAL POWER

నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.

జులై 24న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి ఎస్ఎఫ్ఐ – డివైఎఫ్ఐ

పొలిటికల్ పవర్9 టీవీతెలుగుఏం, వెంకటేశ్వర్లు, బ్రహ్మంగారిమఠం కడప (జిల్లా) :- దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటమాడిన నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. జులై 24న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్ చేయాలని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వద్ద విలేఖల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ… నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలో దేశ విద్య వ్యవస్థ పై విద్యార్థులలో తీవ్ర ఆందోళనను కలిగించాయని అన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నీట్ పరీక్షల అవకతవకాలకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే జోక్యం చేసుకొని స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జులై 24న నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్ ను విద్యాసంస్థల యాజమాన్యాలు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు సోమిరెడ్డిపల్లి అరవింద్, ఉపాధ్యక్షులు సంగటి దేవకుమార్, నాయకులు సిద్దు లు పాల్గొన్నారు.