పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన గట్టు రమేష్ కుమారుడు యువరాజు నీట్ ఫలితాలలో 397 మార్కులు సాధించి సంగారెడ్డి లో MNR కాలేజ్ నందు ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా మోజెర్ల అంబేద్కర్ యువకులు, కాలనీవాసులు యువరాజ్ ను శాలువలు కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు.కాలనీ పెద్దలు మాట్లాడుతూ… యువరాజ్ తల్లిదండ్రులు కష్టపడి పని చేసి యువరాజు ను ఉన్నతంగా చదివించారని తెలిపారు. యువత లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో, పట్టుదలతో సాధన చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని యువరాజ్ నిరూపించారని అన్నారు. నీట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించడం గ్రామానికి ఎంతో గర్వకారణమని, గ్రామ విద్యార్థులు యువరాజ్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యలో రాణించాలని తెలిపారు. యువరాజ్ వైద్య విద్యలో రాణించి సమాజంలోని పేదలకు సేవ చేయాలని,భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ ఆశయాలైన విద్య, అభివృద్ధి, సమానత్వం దిశగా యువత ముందుకు సాగాలని అన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమాలను అంబేద్కర్ యూత్ నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వార్డు నెంబర్లు గట్లు సతీష్, గట్టు వరలక్ష్మి, గట్టు నాగమనెమ్మ , గ్రామ మాజీ సర్పంచ్ గట్టు మన్యం, కాలనీ పెద్దలు గట్టు నారాయణ, గట్టు దయాకర్, గట్టు పెంటన్న,గట్టు కృష్ణయ్య, యువకులు గట్టు నారాయణ, గట్టుచిన్నయ్య, జనంపల్లి మన్యం, గట్టు కళ్యాణ్ బాబు, గట్టు రాజు, గట్టు మల్లేష్, గట్టు విజయ్, గట్టు శివ, గట్టు నగేష్, గట్టు సతీష్, గట్టు బల్ రామ్, గట్టు విష్ణు, తదితరులు పాల్గొన్నారు.