పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి నేలకొండపల్లి: నేలకొండపల్లి నూతన ఉప తపాలా కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు డీసీడీపీ – డి ఏ కె కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి సబ్ పోస్ట్‌మాస్టర్ జి. కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా తపాలా కార్యాలయాల సూపరింటెండెంట్ వి. వీరభద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరై నూతన ఉప తపాలా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం సౌత్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ పి. శ్రీనివాస్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలాగే నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకట లక్ష్మి, ఏఎంసి చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, ఐపిపిబి మేనేజర్ రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, ప్రత్యేక అతిథులు మరియు ఇతర ప్రముఖులు మాట్లాడుతూ… తపాలా శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలు, పొదుపు పథకాలు, బీమా సేవలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) సేవల గురించి ప్రజలకు వివరించారు. తపాలా శాఖ అందిస్తున్న వివిధ ప్రజా ప్రయోజనకరమైన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీసీడీపీ – డి ఏ కె కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము కార్యక్రమంలో భాగంగా ప్రజలకు తపాలా శాఖ అందిస్తున్న వివిధ ప్రజా ప్రయోజనకరమైన సేవలు, పొదుపు పథకాలు, బీమా, ఐపిపిబి తదితర సేవలపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తపాలా సేవలను మరింత చేరువ చేయడం, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన పెంపొందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవరశీర్స్ యం. లక్ష్మణ్, పి. నాగేశ్వరరావు, ఎస్ ఓ పరిధిలోని బీపీఎం లు, ఏబీపీఎం లు, అలాగే కార్యాలయ సిబ్బంది పోస్టల్ అసిస్టెంట్ కనకాచారి , పోస్టుమాన్ ఉపేందర్ రెడ్డి పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు. అలాగే బీపీఎం లుగా గోవిందరావు, ఉపేందర్, మోహన్ రావు, కృష్ణ వేణి, జానకమ్మ, సందీప్, అజయ్, రామకృష్ణ, సత్యనారాయణ సింగ్, సత్యనారాయణ, సుచిత, చరిత, నవ్య, జయ వర్ధన్ తదితరులు, ఏబీపీఎం లుగా ఓంకారమ్మ, అనూష, రాకేష్, ప్రణయ్, తిరుమలేశ్, దీపక్, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నూతన ఉప తపాలా కార్యాలయం ప్రారంభంతో నేలకొండపల్లి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత మెరుగైన, సులభమైన మరియు విస్తృతమైన తపాలా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా తపాలా శాఖ సేవలను మరింత విస్తరించేందుకు ఈ నూతన ఉప తపాలా కార్యాలయం కీలకంగా ఉపయోగపడనుంది. ప్రజలకు తపాలా శాఖ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పిస్తూ, నూతన ఉప తపాలా కార్యాలయ ప్రారంభోత్సవం మరియు డీసీడీపీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.