POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 1:47 pm Posted by : POLITICAL POWER

నూతన మహేంద్ర ట్రాక్టర్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ 07 మే 2026: వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ట్రాక్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని, నరసింహ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాంతయ్య, మాజీ సర్పంచ్ శారద ఆసన్న నాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసులు, నరసింహ రామదాస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.