POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 5:29 pm Posted by : POLITICAL POWER

నేను లై డిటెక్టర్ పరీక్షతో పాటు సీఐడీ విచారణకు సిద్ధం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 23 2026: మరి రేవంత్ రెడ్డి తన కుటుంబ అవినీతి అంశంలో సిట్, సీఐడీ విచారణకు సిద్ధమా? నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలి.. లేదంటే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి గ్లోబరీనా సంస్థ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం గ్లోబరీనా సంస్థ నిజంగానే నా బినామీ సంస్థే అయితే అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుంది మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసం రాజ్ భవన్ ధర్నా ముందు చేయాల్సిన కొడంగల్లో చేయడం రాజకీయ నాటకం మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించరు, రేవంత్ రెడ్డి మోడీ పేరును ప్రస్తావించడానికి కూడా భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక మూట ఇస్తే, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడు ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు నడుస్తున్నాయి