ePaper
Monday, November 9, 2026
📄 ePaper

నేనే కేంద్రం.. నేనే రాష్ట్రం!.. ఎల్-నీనో కష్టాల్లో ఉంటే.. టేకులపల్లిలో నీరు వృధా! శంభునిగూడెంలో సర్పంచ్ ఏకపక్ష పాలన.. మండిపడుతున్న గ్రామస్తులు

📰 Generate e-Paper Clip

 

 

– PN9న్యూస్ / టేకులపల్లి ప్రతినిధి, కాకటి సత్యప్రసాద్ (నవంబర్ 9):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామంలో ప్రజాధనం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా నీళ్లలో పోతున్నాయో చెప్పడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు ఎల్-నీనో ప్రభావంతో ఎండలు మండి, గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు అల్లాడిపోతుంటే.. ఇక్కడ మాత్రం నీరు అమృతంలా కాకుండా అడ్డదిడ్డంగా వృధాగా పోతోంది. బోరు వేసిన దగ్గరి నుండి మోటార్ బంద్ చేసే వరకు నీరంతా వీరులై పారుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు!

నీటి వృధా పట్ల నిరసనల హోరు

ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి బాటలో నడిపించడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే.. శంభునిగూడెంలో మాత్రం సర్పంచ్ తీరు చూస్తుంటే ‘నేనే కేంద్రం.. నేనే రాష్ట్రం’ అన్నట్లుగా తయారైంది. సామాన్య ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నా, అధికారులు మాత్రం మౌనం వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి చుక్క విలువ తెలియని ఈ పాలనపై తక్షణమే డీపీఓ (DPO), ఎంపీఓ (MPO), ఎంపీడీవో (MPDO) స్పందించి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఒక్కరి చేతిలోనే అన్నీ.. ‘మల్టీపర్పస్’ మాయాజలం

గ్రామపంచాయతీలో పనుల నిర్వహణ తీరు మరింత అస్తవ్యస్తంగా తయారైంది. పేరుకు మాత్రమే మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అసలు పరిస్థితి వేరేలా ఉంది. రోడ్ల శుభ్రత నుండి మొదలుకొని ఇతరత్రా అన్ని గ్రామపంచాయతీ పనులను కేవలం ఒక్కరి చేతనే చేయిస్తున్నారంటే పంచాయతీ పాలన ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

అధికార దర్పంతో సాగుతున్న ఈ ఏకపక్ష విధానంపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? లేదా? వేచి చూడాల్సిందే! గ్రామంలో జరుగుతున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణ చర్యలు తీసుకోవాలని శంభునిగూడెం ప్రజలు కోరుతున్నారు.

 

Latest Articles

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజపొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు  పొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ పొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ పొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ పొలిటికల్ పవర్...

Related Articles

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 09) అశ్వారావుపేట : మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు తూర్పు బజార్‌లో...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 09) అశ్వారావుపేట : మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు తూర్పు బజార్‌లో...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 09) అశ్వారావుపేట : మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు తూర్పు బజార్‌లో...
error: Content is protected !!