నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్
*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి* పొలిటికల్ పవర్ ప్రతినిధి ఖమ్మం గంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నిర్మానుష ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి వినియోగం, విక్రయాలు, సరఫరాకు...