పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏఐపీసీ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఐపీసీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు జి. నాగార్జున, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకుడు ఎత్తం చరణ్‌రాజ్ ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిమళతో పాటు కార్యాలయ సిబ్బందికి ఫారం–18లను అందజేశారు. అర్హులైన పట్టభద్రులందరూ ఫారం–18 ద్వారా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును పొందాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డికి మద్దతుగా పట్టభద్రులు నిలిచి ఆయన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, పుట్ట బాలరాజు, కుమార్, రాజు, రవి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.