POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 5:27 pm Posted by : POLITICAL POWER

పదవీ విరమణ శేష జీవితం కాదు, విశేష జీవితం

విశ్రాంత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ గుండ్రాతి వామన్ గౌడ్, పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 31 2026: పదవీ విరమణ శేష జీవితం కాదు విశేష జీవితం అన్ని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మరియు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఉద్యోగులు తమ పదవీ విరమణ తార్వత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమాజ సేవ కోసం ఉపయోగించుకోవాలన్నా రు. అన్నారు. ముప్పై రెండు సంవత్సరాల పాటు ఉద్యోగ విధులు నిర్వహించి సోమవారం నాడు పదవి విరమణ చెంధిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వివేకానంద ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తకోట లో జరగిన సమావేశం లో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకిత భావంతో ఉద్యోగ విధులు నిర్వహించిన వారు అదే స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలలో, వ్యవసాయ పనులలో నిమగ్నం కావాలని సూచించారు. మండల అభివృద్ధి అధికారిగా చక్కని బాధ్యతలు చేపట్టిన సేవలను వారు కొనియాడారు. ప్రజలతో ఆమెకు గల అనుబంధాన్ని కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణయ్య ఎంఈఓ ఫరూక్ హుస్సేన్, జిహెచ్ఎంఎస్ నిర్మలా దేవి, విష్ణు,ప్రవీణ్ కుమార్ సురేష్,యూనియన్ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.