POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 4:40 pm Posted by : POLITICAL POWER

పదోన్నతులు ఉద్యోగులకు ప్రేరణనిస్తాయి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: ప్రతి ఉద్యోగి జీవితంలో పదోన్నతులు కొత్త ఉత్సాహాన్ని ప్రేరణనిస్తాయని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఇరవై ఏళ్ళకు పైగా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రాజగౌడుకు ఇటీవల హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించడం పట్ల సాహితీ కళా వేదిక సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఆయనను శాలువ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.కళావేదిక పక్షాన స్థానిక రేడియంట్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో పని చేయడం,తోటి ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉండటం రాజగౌడ్ యొక్క గొప్ప వ్యక్తిత్వం అని కొనియాడారు.ఇన్నాళ్ల తన ఉద్యోగ జీవితంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో పిఆర్ ఒ గా పనిచేయడమేగాక ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ఉన్నతాధికారుల, ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారని శంకర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్,దేశి రాములు యాదవ్, బండారు శ్రీనివాస్, రాజేంద్రచారి, మద్దిలేటి, రమేష్, కృష్ణవేణి శోభ నుష్రత్ తభసుం శైలజ పుష్పాలత హేమలత స్వప్న తదితరులు పాల్గొన్నారు.