POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:30 pm Posted by : POLITICAL POWER

పద్మశ్రీ గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు,

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆర్సి కారం వెంకటేష్ జులై 07 2026: ములకలపల్లి మండల కేంద్రంలో, అదేవిధంగా ప్రతి దళిత వాడల్లో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు రాయల శ్రీహరి, ఉపాధ్యక్షులు రింగు బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు దీపంగి వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరైనారు. అదేవిధంగా ములకలపల్లి మండలంలోని 10 గ్రామాల ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులు యూత్ అధిక సంఖ్యలో పాల్గొని గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన త్యాగాలు, పోరాటాలు యువతకు ఆదర్శమని కొనియాడారు. దేశం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, ఆయన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కొరకు పట్టు వదలని విక్రమార్కుడిలా అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 10 గ్రామాల ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులు యూత్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.