పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుతో కదనరంగంలోకి యంగ్ బ్రిగేడ్: ఖమ్మం 28వ డివిజన్లో ఘనంగా ‘యం.ఎస్.ఎఫ్’ కమిటీ ఏర్పాటు! విద్యార్థుల హక్కుల పరిరక్షణే ధ్యేయం – సమస్యలపై సమరశంఖం పూరిస్తాం: బాకీ శ్రీను మాదిగ హెచ్చరిక
ఖమ్మం (పట్టణం):ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఎన్. శివకుమార్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ పిలుపుతో విద్యార్థి లోకంలో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. భవిష్యత్తు పోరాటాలకు సన్నద్ధమవుతూ... మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) ఖమ్మం నగరంలోని 28వ డివిజన్ (ప్రకాష్ నగర్) నూతన కమిటీ నిర్మాణం ఆదివారం అత్యంత వైభవంగా రూపుదిద్దుకుంది. కొల్లి విద్యాసాగర్ (సాగర్) గారి పర్యవేక్షణలో, ఎమ్మార్పీఎస్ మరియు యం.ఎస్.పి (MSP) నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థి రంగాన్ని నడిపించేందుకు నూతన బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....