POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 3:02 pm Posted by : POLITICAL POWER

పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ శిక్షణ ప్రవేశ పరీక్షలు విజయవంతం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మరియు శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామక శిక్షణ అందించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ఆదివారం విజయవంతంగా జరిగాయి. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి. మధుకర్ స్వామి, డి.సి.పి. సారథ్యంలో నిర్వహించిన ఈ పరీక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో, అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4 కేంద్రాల్లో నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పరీక్షకు సుమారు 242 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి నాలుగు నెలల పాటు పూర్తిగా ఉచితంగా పోలీస్ నియామక శిక్షణ అందించనున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గద్దె భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గద్దె భాస్కర్, సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్, సత్తార్, శివలింగం, రమేష్, ఉప్పరి తిరుమలేష్, కండ్రెని వెంకటేష్, బి. రాము తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దె భాస్కర్ మాట్లాడుతూ… నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రతినిధులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.