–దోమల వృద్ధికి కారణమయ్యే నిల్వ నీటిని తొలగించి, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, కొత్తకోట చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు 22.2026.దోమల నివారణ కార్యక్రమం పరిసరాలపరిశుభ్రతేఆరోగ్యానికితొలిఅడుగుదోమల వృద్ధికి కారణమయ్యే నిల్వనీటినితొలగించి, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని కొత్తకోట చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం దేవరకద్ర శాసనసభ్యులుజి.మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తకోట మున్సిపాలిటీలో పరిశుభ్రత దోమల నివారణ కార్యక్రమం పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలి అడుగు. దోమల వృద్ధికి కారణమయ్యేనిల్వనీటినితొలగించి,ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే ను పాటిస్తూ దోమల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకుందాం మని అన్నారు. ఈ సందర్భంలో మున్సిపాల్ చైర్మన్ పర్సన్ అరుణ శ్రీనివాస్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను ముందస్తు జాగ్రత్తలతో అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు అన్నారు. ఈకార్యక్రమంలో కొత్తకోటచైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్‌పర్సన్ పల్లవి కృష్ణారెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ చంద్రకాంత్, 10వ వార్డు కౌన్సిలర్ సంజీవుడు, 6వ వార్డు కౌన్సిలర్ అఖిల సుభాష్, 3వ వార్డు కౌన్సిలర్ అద్దాల మురళి, పట్టణ అధ్యక్షులు పెంటన్నా యాదవ్, మాజీ వార్డు సభ్యులు సలీం ఖాన్,డీసీ. శ్రీకాంత్ ఆశా వర్కర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

