
పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి:
ఎల్ల స్వామి జయశంకర్ భూపాల్ పల్లి
వెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, దాని సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెదురు వేగంగా అభివృద్ధి చెందే సహజ వనరుగా ఉండటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహద పడుతుందన్నారు. వెదురుతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా సంప్రదాయ వృత్తిదారులు, మేదర సంఘాల సభ్యులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.
వెదురు సాగును ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వెదురు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు, ఆధునిక డిజైన్‌లు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే సంప్రదాయ వృత్తిదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మేదర సంఘ నాయకులు గైని చంద్రశేఖర్, బూర పద్మ, చందా ప్రసాద్, కుంచనపల్లి శ్రీధర్, రాజయ్య, శంకరయ్య, సంపత్, మస్కు జయ తదితరులు పాల్గొన్నారు.