పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను పెంచడంలో వేదురు సాగు కీలకపాత్ర పోషిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి: ఎల్ల స్వామి జయశంకర్ భూపాల్ పల్లి వెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, దాని సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెదురు వేగంగా అభివృద్ధి చెందే సహజ వనరుగా ఉండటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహద...