పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ను రాష్ట్ర “కొత్త తెలంగాణ చరిత్రబృందం”సంస్థ ఆదివారం(తేదీ:6-9-2026)నాడు నందికంది క్షేత్రంలో ఘనంగా సన్మానించారు. కొత్త తెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది క్షేత్రంలో ఏర్పాటు చేసిన “బొమ్మలపల్లకి ప్రతిభా పురస్కార సభ”కు శంకర్ గౌడ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలపై ఇటీవల KTBC(కొత్త తెలంగాణ చరిత్రబృందం) ఆధ్వర్యంలో వీడియోగ్రఫి పోటీలను నిర్వహించారు. విజేతలైన వారికి నందికంది క్షేత్రంలో బహుమతి ప్రధాన ఉత్సవం జరిగింది.ఆ సందర్భంలోనే సాహిత్య సాంస్కృతిక సామాజిక రంగాలకు పలుస శంకర్ గౌడ్ అందిస్తున్న సేవలకు గాను KTBC పక్షాన ఆయనను నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ & గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మణికొండ వేదకుమార్,ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సి ఈ ఓ డా.ఈమని శివనాగి రెడ్డి,కొత్త తెలంగాణ చరిత్రబృందం సంస్థ రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఘనంగా సన్మానించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో KTBC ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్, చరిత్ర పరిశోధకులు అరవింద్ ఆర్య, కపిలవాయి అశోక్ బాబు, రవీందర్ రెడ్డి, స్రవంతి విజయభాస్కర్ రెడ్డి, రంగాచార్య, డా. బైరోజు శ్యాంసుందర్, రాములు, గణేశ్ కుమార్, శ్రీనివాస్, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.