POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 8:12 pm Posted by : POLITICAL POWER

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం

ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి సన్మానం.. నూతన వధూవరులకు ఆశీర్వాదం

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, అక్టోబర్ 29: బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం గురువారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సాయి కిషోర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, సీతారామచంద్ర స్వామివారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు.

అనంతరం అశ్వారావుపేటలోని శ్రీశ్రీ కల్యాణ మండపంలో సంకురాత్రి దుర్గాప్రసాద్‌–సునీత దంపతుల కుమార్తె శార్వాణి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్‌లో దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ కునుసోతు రూప్‌సింగ్‌–సూర్యవేణి దంపతుల కుమార్తె నందిని వివాహానికి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ డాక్టర్‌ భూక్య ఉదయజ్యోతితో కలిసి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కాసాని చంద్రమోహన్‌, డాక్టర్‌ భూక్య ప్రసాద్‌, కోనకళ్ల శ్రీనివాసరావు, మాడి ముత్యాలరావు, మాజీ సర్పంచ్‌ సున్నం రామలక్ష్మయ్య, పానుగంటి లక్ష్మణరావు, బొల్లుకొండ చెన్నారావు, గోడవర్తి వెంకటేశ్వరరావు, కునుసోతు నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.