పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం

ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి సన్మానం.. నూతన వధూవరులకు ఆశీర్వాదం పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, అక్టోబర్ 29: బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం గురువారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సాయి కిషోర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, సీతారామచంద్ర స్వామివారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం అశ్వారావుపేటలోని శ్రీశ్రీ కల్యాణ మండపంలో సంకురాత్రి దుర్గాప్రసాద్‌–సునీత దంపతుల కుమార్తె శార్వాణి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సత్తుపల్లిలోని రాణి...