పల్లెల్లో పారిశుద్ధ్యం గబ్బుగబ్బు
పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలి దోమల నివారణపై దృష్టి ఏదీ? నిధులు విడుదల చేయాలని ప్రజల డిమాండ్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్ట 22 2026: అశ్వారావుపేట: మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మురుగు కాలువలు నిండిపోవడం, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం, దోమలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు స్థానికంగా అందుబాటులో ఉండి...