POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 11:40 am Posted by : POLITICAL POWER

పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వెల్టూరు గ్రామ సర్పంచ్ డి. అశోక్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఆదివారం రోజు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ డి. అశోక్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా గ్రామ ప్రజలు సహకరించాలని గ్రామ పెద్దలు కోరారు.