
జూలూరుపాడు: సెప్టెంబర్15: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ :/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి, గత ఆగస్టు 31న ఉద్యోగ విరమణ పొందిన. శ్రీ వెన్న ఉదయ సేత్.తన ఉద్యోగ జీవితానికి గుర్తుగా పాఠశాల సిబ్బందికి ఉపయోగపడే విధంగా రూ.16,000 విలువైన వోల్టాస్ కంపెనీ వాటర్ డిస్పెన్సర్ (వాటర్ కూలర్ మరియు మినీ ఫ్రిజ్)ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి. లక్ష్మీనరసయ్య అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ వెన్న ఉదయ సేత్ మాట్లాడుతూ, తాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడులో విధులు నిర్వహించిన కాలంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తనను ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో, గౌరవంగా చూసుకున్నారని తెలిపారు. పాఠశాలతో తనకు ఏర్పడిన ఆత్మీయ అనుబంధానికి గుర్తుగా ఈ వాటర్ డిస్పెన్సర్‌ను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ అనంతరం కూడా పాఠశాల పట్ల తనకున్న అభిమానం, ఆత్మీయతను చాటుతూ సిబ్బంది ఉపయోగార్థం విలువైన వాటర్ డిస్పెన్సర్‌ను అందజేయడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి. లక్ష్మీనరసయ్య ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది శ్రీ వెన్న ఉదయ సేత్ ను అభినందిస్తూ, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన సేవలను, పాఠశాల పట్ల చూపిన అభిమానాన్ని పాఠశాల సిబ్బంది కొనియాడారు.