పామాయిల్ గెలల దొంగతనాలకు చెక్.. పోలీసుల కఠిన చర్యలు
ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు పొలిటికల్ పవర్,దమ్మపేట సెప్టెంబర్ 12: పామాయిల్ గెలల దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల పామాయిల్ గెలల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు, పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లు, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాలకు చెందిన పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్య ప్రతినిధులు, పాకలగూడెం పామాయిల్ గెలల కలెక్షన్ ఏజెంట్...