POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 6:40 pm Posted by : POLITICAL POWER

పామిరెడ్డిపల్లి గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక కల్పవృక్షంలా ఉపయోగపడుతోందని లబ్ధిదారులు పేర్కొన్నారు. అనారోగ్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి అతి తక్కువ సమయంలో చెక్కులు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారుల వివరాలు: కావలి బాలయ్య (కరెన్న కుమారుడు) – రూ.1,06,000/- పానుగంటి సుజాత (విజయ్ బాబు భార్య) – రూ.48,000/- పానుగంటి చిట్టెమ్మ (మాసయ్య భార్య) – రూ.11,000/- మొత్తం రూ.1,65,000/- విలువైన సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచులు సిద్దయ్య, తిక్కన్న నాయక్, మధిర శ్రీశైలం, సందడి మన్యపు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయనిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని వారు పేర్కొన్నారు.