POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 10:19 am Posted by : POLITICAL POWER

పామిరెడ్డిపల్లి గ్రామసభలో సంక్షేమ పథకాలపై అవగాహన

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: పెద్దమందడి మండలం, పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రైతు వేదికలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, విద్యుత్, శిశు సంక్షేమం, మిషన్ భగీరథ తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై గ్రామసభలో విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ మాట్లాడుతూ… ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఇందిరా జీవన బీమా రెండో విడత, ఇందిరమ్మ ఇళ్లు, వితంతు మరియు వృద్ధాప్య పెన్షన్ల గురించి గ్రామస్థులకు వివరించారు. అలాగే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ గ్రామసభ ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాములమ్మ, వార్డు సభ్యులు నరేష్, కృష్ణ, యాదమ్మ, గ్రామసభ స్పెషల్ ఆఫీసర్ మంజులత, ఎంఈఓ, గ్రామ కార్యదర్శి స్రవంతి, నాయకులు భీమిరెడ్డి నాగేంద్ర, నరసింహ, రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.