POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 4:40 pm Posted by : POLITICAL POWER

పామిరెడ్డిపల్లి పాఠశాలకు మైక్ సెట్ వితరణ

పూర్వ విద్యార్థి పానుగంటి శాంతయ్యకు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 14 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి, గ్రామానికి చెందిన పానుగంటి శాంతయ్య మైక్ సెట్‌ను వితరణ చేయడం అభినందనీయమని మండల విద్యాధికారిణి మంజులత కొనియాడారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారిణి మంజులత మాట్లాడుతూ… పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం పానుగంటి శాంతయ్య మైక్ సెట్‌ను అందించడం ద్వారా పాఠశాల కార్యక్రమాల నిర్వహణకు, విద్యార్థుల భవిష్యత్తుకు తనవంతు సహాయాన్ని అందించారని ప్రశంసించారు. ఆయన సేవా గుణం, విద్యార్థుల పట్ల ఉన్న అభిమానం అభినందనీయమన్నారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ.. తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఇదే పాఠశాలలో విద్యనభ్యసించి, తిరిగి అదే పాఠశాల విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న పానుగంటి శాంతయ్యను గ్రామం తరఫున అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ… గ్రామంలోని విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో పానుగంటి శాంతయ్య ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. పాఠశాలకు అందించిన మైక్ సెట్‌తో భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించిన అనేక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. CRP తిరుపతి రెడ్డి మాట్లాడుతూ… తాను కూడా శాంతయ్యతో కలిసి ఇదే పాఠశాలలో చదువుకున్నానని, పూర్వ విద్యార్థిగా పాఠశాలకు సహాయం చేయడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు. దాత పానుగంటి శాంతయ్య మాట్లాడుతూ… తాను 1991లో ఇదే పాఠశాలలో ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించానని తెలిపారు. అప్పట్లో పాఠశాలలో సుమారు 200 నుంచి 300 మంది విద్యార్థులు ఉండేవారని, నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గ్రామ పాఠశాలకు తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీలు కృష్ణవేణి భాయి, కవిత, ఐఈడీ లక్ష్మయ్య, ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పూజిత, ఆయాలు కురువమ్మ, శారద తదితరులు పాల్గొన్నారు.