POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 5:52 pm Posted by : POLITICAL POWER

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: అదనపు కలెక్టర్‌ ఖిమ్యా నాయక్

 

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్‌ అధికారులను ఆదేశం,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు
15.2026.
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోనిప్రభుత్వఆసుపత్రిప్రాంతంలోనిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. దోమలవృద్ధికిఅవకాశం లేకుండా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకుఅవగాహనకల్పించాలని ఆదేశించారు. అనంతరం  కొత్తకోట మున్సిపాలిటీ లోని ఆరో వార్డులో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌ అక్కడ అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది అందుబాటు, వర్షాకాల వ్యాధుల నియంత్రణకు చేపట్టిన ముందస్తుఏర్పాట్లపై వైద్యాధికారులను అడిగితెలుసుకున్నారు.అనంతరం పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలుప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలనిసూచించారు. పాఠశాల విద్యార్థుల యూనిఫాం కుట్టింపు, పంపిణీ పురోగతిపై వివరాలు తెలుసుకుని, ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సైదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ శ్రీనివాస్,కౌన్సిలర్లు, బోయెజ్, అఖిల తండ్రి సుభాష్, సుధా రామ్మోహన్ రెడ్డి,సంజీవుడు,మహమ్మద్,ఆషిఫ్,సలీమ్,యాదయ్య ,  వైద్యాధికారి, ఆశా కార్యకర్తలు, పంచాయతీ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.