పార్కలగండికి చేయూత.. 25 నూతన పెన్షన్లు మంజూరు
లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ కొమరం సుశీల పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 14: అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించి, ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన చేయూత సామాజిక భద్రత పెన్షన్లు పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. దమ్మపేట మండలం పార్కలగండి గ్రామపంచాయతీకి మొత్తం 25 నూతన పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొమరం సుశీల ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్ల...