పార్కలగండి ఆశ్రమ పాఠశాలఅభివృద్ధికి ఐటీడీఏ నిధులు రూ.30 లక్షలతో పనులకు శ్రీకారం
డైనింగ్ హాల్, కిచెన్ మరమ్మతులు, టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు.. సర్పంచ్ కొమరం సుశీల పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సర్పంచ్ కొమరం సుశీల ఆధ్వర్యంలో ఐటీడీఏ ద్వారా మంజూరైన రూ.30 లక్షల నిధులతో పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆశ్రమ పాఠశాలలో వందలాది మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు డైనింగ్ హాల్ నిర్మాణం,...