పార్కలగండి గ్రామపంచాయతీలో ఘనంగా సామూహిక శ్రీమంతం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండలం పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడీల ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కొమరం సుశీల హాజరై గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, పరిశుభ్రత మరియు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ, సూపర్వైజర్, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.