రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: సచివాలయం లోని వారి కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఇట్టి సమావేశంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొని పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని వారు మంత్రిని కోరారు. ప్రాజెక్టు చరిత్రాత్మక ప్రాధాన్యతను వివరించి, దీని ద్వారా జిల్లాలో నీటి సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంతో పాటు మిగిలిన నిధులను కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. భూసేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై ఎప్పటికప్పుడు సమగ్ర సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిని పర్యవేక్షిస్తామని తెలిపారు. పాలమూరు ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని, రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. పదిహేను రోజుల్లోగా ఉమ్మడి జిల్లాకు వస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.