పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని దీతిక శ్రీ 2026లో నిర్వహించనున్న 2వ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ కు ఎంపిక కావడం విశేషం. అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు శిక్షణలో కఠోర సాధన చేస్తూ ప్రతిభ కనబరిచిన దీతిక శ్రీ, తన ప్రతిభతో “వండర్ కిడ్ అవార్డు” ను కూడా”అందుకుంటాను అని తెలిపిందిఎ . దీతిక శ్రీ తల్లిదండ్రులు శ్రీనివాస్ మరియు సుమలత తమ కుమార్తె విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా SPF అసిస్టెంట్ కమాండర్ కె. చంద్రశేఖర్, సీఐ కిరణ్ దీతిక శ్రీని అభినందిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి పాల్వంచకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు మాట్లాడుతూ, దీతిక శ్రీ ఎంతో కష్టపడి సాధన చేసే విద్యార్థిని అని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే సామర్థ్యం ఉందని తెలిపారు.