పిల్లల మెదళ్లను బానిసలుగా కాదు… ఆలోచించే నాయకులుగా తీర్చిదిద్దే భారతీయ కృత్రిమ మేధస్సు వేదిక – మైవిజ్ ఏఐ”
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే25: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు విద్యా రంగాన్ని వేగంగా ప్రభావితం చేస్తున్న ఈ కాలంలో… “ఏఐ పిల్లల ఆలోచనా శక్తిని బలహీనపరుస్తోందా?” అనే ప్రశ్న తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా సాధారణ ఏఐ సాధనాలు విద్యార్థుల్లో సిద్ధంగా సమాధానాలు పొందే అలవాటును పెంచుతూ, స్వయంగా ఆలోచించే సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయనే ఆందోళనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారతీయ విద్యా విధానానికి అనుగుణంగా, పిల్లల మేధో వికాసాన్ని దృష్టిలో...