తిప్పలపై పేదల గృహాలకు డోర్ నెంబర్లు, ఇంటి పన్నులు, స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి.
పేదల నివసించే స్లం ఏరియాలలో మంచినీటి కొళాయిలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి.
బద్వేలు “ప్రత్యేక గ్రీవెన్స్ సెల్” లో ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 30 2026 జూన్ 30వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు, బద్వేలు స్థానిక రాఘవేంద్ర కళ్యాణమండపం నందు, రాష్ట్ర ప్రభుత్వం బద్వేలు నియోజకవర్గం రెవిన్యూ సమస్యలపై, ప్రజా సమస్యలపై “ప్రత్యేక గ్రీవెన్స్ సెల్” ఏర్పాటు చేయడంతో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ బద్వేల్ పట్టణ కార్యదర్శి కే.శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.చాద్ బాషా లతో కూడిన సిపిఎం బృందం, బద్వేలు స్థానిక ఊరి చివర్లలో కొండ తిప్పలపై గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఉంటున్న నిరుపేదల కాలనీలైన పుచ్చలపల్లి సుందరయ్య నగర్, చాకలి ఐలమ్మ కాలనీ, జ్యోతి బోస్ కాలనీల ప్రజలతో కలిసి, వారి స్థానిక ప్రజల సమస్యలపై బద్వేలు ఆర్డిఓ చంద్రమోహన్ ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ… 2002లో భారతదేశ తొలి పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరిట కాలనీ పేదలతో నిర్మాణం జరిగిందని, 2008 లో నిరుపేదలతో కామ్రేడ్ చాకలి ఐలమ్మ కాలనీ నిర్మాణం చేశామని, 2016లో కామ్రేడ్ జ్యోతిబసు పేరిట వికలాంగులులతో కాలనీ నిర్మాణం జరిగిందని, నేటికీ రెండు, మూడు దశాబ్దాలు పూర్తయిన సుమారు పదివేల మంది ప్రజలు నివాసాలు ఉంటున్న ఇప్పటివరకు వారికి త్రాగునీరు, రోడ్లు, కరెంటు, స్కూలు, అంగన్వాడి సెంటరు, ప్రాథమిక వైద్య కేంద్రం, డోర్ నెంబర్లు, ఇంటి పన్నులు లాంటి కనీస మౌలిక సౌకర్యాలు అందడం లేదన్నారు. సిపిఎం చేసిన ప్రజా పోరాటాల కారణంగా గతంలో మంత్రి గర్ల అరుణకుమారి, ఎం.పీ.లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలనీలను సందర్శించి పేదలకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానాలు ఇచ్చారని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనకుండా అన్ని ప్రభుత్వాలు పాలకులు మాట తప్పారని జిల్లాఅధికారులే, స్థానిక అధికారులే పేదల కష్టాలు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో చంద్రమోహన్ స్పందిస్తూ తప్పకుండా ప్రభుత్వాలకు, నిధుల విడుదలకు, నివేదికలు తయారు చేసి పంపిస్తామని, సమ్మతిత అధికారులను పిలిపించి మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ సభ్యులు మోక్షమ్మ , ఖైరున్ బి, సుబ్బరాయుడు, ఆర్. ఓబయ్య, మూరా ప్రసాద్, శ్రీను, కొండయ్య, రాజగోపాల్, బాలమ్మ, మూడు మూడు కాలనీల ప్రజలు పాల్గొన్నారు.