పీఎఫ్ బకాయిలు చెల్లించక ఉద్యోగులను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడం దారుణం: ఎస్‌పీఎస్ యం & హెచ్ వర్కర్స్ అసోసియేషన్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జూన్ 26 2026: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ శ్రీమతి హన్మమ్మకు నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన పీఎఫ్ బకాయిలు, రెండు నెలల జీతం అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ రాష్ట్ర ఎస్‌పీఎస్ యం & హెచ్ వర్కర్స్...