POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 6:29 pm Posted by : POLITICAL POWER

పీఎస్‌వో రామకృష్ణ తండ్రి బుచ్చన్న మృతి పట్ల ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సంతాపం

కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తన వ్యక్తిగత భద్రత అధికారి (పీఎస్‌వో) రామకృష్ణ తండ్రి బుచ్చన్న మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పెబ్బేరు మండలం తిప్పాయిపల్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, బుచ్చన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బుచ్చన్న పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణను, కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డి, పట్టణాధ్యక్షుడు దయాకర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.