పెండింగ్ అరెస్టులు పూర్తి చేయాలి, NDPS కేసుల్లో సరఫరా నెట్వర్క్ను ఛేదించాలి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి. నేర నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి : మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్, జిల్లాలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నమోదైన వివిధ కేసుల పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణ చర్యలు, ముందస్తు నేర నివారణ (Proactive Policing), సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. నల్లబెల్లం అక్రమ...