POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 8:42 pm Posted by : POLITICAL POWER

పెండింగ్ డిమాండ్ల సాధనకు సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

సత్తుపల్లి ఏరియా జి ఎం కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

పీఆర్పీ బకాయిల చెల్లింపు, పే అప్‌గ్రేడేషన్, అలవెన్సుల అమలుకు సీఎంఓఏఐ డిమాండ్.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 30 2026: కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సింగరేణిలోని అన్ని ఏరియాల్లో పెండింగ్ డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం 9.00 గంటలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. సింగరేణి అధికారులకు పీఆర్పీ బకాయిల చెల్లింపు, వేతన సవరణతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎస్ సి సి ఎల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అధికారులు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. జూన్ 29 నుంచి జూలై 13 వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. తొలి రోజు వి. వేమా రెడ్డి (ఎస్‌ఈ–ఎస్‌ఎంఎంసీ, రిటైర్డ్), ఏ. అవినాష్ (డిప్యూటీ మేనేజర్), కె. రాజేష్ (డిప్యూటీ మేనేజర్), ఏ. ప్రదీప్ కుమార్ (జాయింట్ సెక్రటరీ, సీఎంఓఏఐ), డి. శ్రీనివాస్ (ట్రెజరర్, సీఎంఓఏఐ) నిరాహార దీక్షలో కూర్చొన్నారు. వీరికి సత్తుపల్లి ఏరియాలోని ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఎన్‌వీఆర్ ప్రహ్లాద్, ఏఎల్‌ఎస్‌వీ సునీల్ వర్మ, ఎస్‌ఓ టు జీఎం, బొల్లం శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ కె. సోమశేఖర్, డి. రమేష్ బాబు (సీఎంఓఏఐ వైస్ ప్రెసిడెంట్)తో పాటు అన్ని ప్రాజెక్టుల ప్రాజెక్ట్ ఇంజనీర్లు, అన్ని ఓపెన్‌కాస్ట్‌ల అధికారులందరూ సంఘీభావం తెలిపారు. రానున్న రోజుల్లో సంఘ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు రిలే నిరాహార దీక్షలను కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రధాన డిమాండ్లు: 1. కోల్ ఇండియాలో అమలు చేసిన విధంగా సింగరేణి అధికారులకు పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలి. 2. పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలి. 3. కోల్ ఇండియా అధికారులతో సమానంగా అన్ని అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కల్పించాలి. 4. సింగరేణికి రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.