పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైయస్‌ఆర్‌సీపీ నిరసన అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మహా ధర్నా

పొలిటికల్ పవర్  జాతీయ తెలుగు దినపత్రిక తూర్పుగోదావరిజిల్లా అనపర్తి, మే 18: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యులపై భారం మోపుతోందని ఆరోపిస్తూ, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనపర్తిలో సోమవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనపర్తి వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి...