POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 6:32 pm Posted by : POLITICAL POWER

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్‌పీఎస్ యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు

కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని రాష్ట్ర నాయకుల డిమాండ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ జూన్ 05 2026: పెద్దపల్లి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సంక్షేమం కోసం ఎస్‌పీఎస్ (శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు అనేక ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ సరైన వేతనాలు, భద్రతా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీసం రూ.26 వేల వేతనం, రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా నియమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌పీఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు వైనాల రవి, మాతంగి అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు, కార్యదర్శులు పి. అంజలి, సంతోష్, జనగామ జిల్లా అధ్యక్షులు ఏనుగుల రఘు, జిల్లా ప్రధాన కార్యదర్శి గండి అజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పెద్దపల్లి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నూతన కమిటీని ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడిగా పొన్నం రాజు, ప్రధాన కార్యదర్శిగా రాకేష్, కోశాధికారిగా శివ ఎన్నిక కాగా, మొత్తం 19 మంది సభ్యులకు వివిధ బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.