POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:35 am Posted by : POLITICAL POWER

పెద్దమందడిలో గురుపూజోత్సవం సందర్భంగా గురువులకు ఘన సన్మానం

గురువులకు సన్మానం చేసిన స్వాతి విట్టల్ రెడ్డిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01, 2026: గురుపూజోత్సవం సందర్భంగా పెద్దమందడి గ్రామంలో ప్రముఖ గురువులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సమాజ నిర్మాణంలో గురువులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ బీజేపీ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఉపాధ్యాయులు నందిమల్ల కృష్ణయ్య, సరస్వతి శిశు మందిర్ మాతాజీ శశికళలను శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ ధార్మిక జాయింట్ కన్వీనర్ స్వాతి రెడ్డి, బీజేపీ సీనియర్ కార్యకర్త విఠల్ రెడ్డి, పవన్ ముదిరాజ్ పాల్గొన్నారు. గురువులు విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని, ఈ కార్యక్రమాలు ఆ విలువలను భవిష్యత్ తరాలకు చేరవేస్తాయని అన్నారు. సన్మానం అందుకున్న గురువులు కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు గురువులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వారి సేవలను ప్రశంసించారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ గురుపూజోత్సవ సన్మాన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.