POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 12:29 pm Posted by : POLITICAL POWER

పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పెద్దమందడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ జి. సైదులు (M.Sc., B.Ed.) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్, అధ్యాపకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రవీణ్ కుమార్, తిరుపతయ్య, చెన్నకేశవులు, మహేందర్, రఘు, గోవర్ధన్, నరసింహస్వామి, సతీష్ తదితరులతో పాటు నాన్‌-టీచింగ్ సిబ్బంది. రహీం, మంజులత, పారిజాత, శ్రీనివాసులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.