POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 3:55 pm Posted by : POLITICAL POWER

పెద్దమందడి మండలంలో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం

– ఆయా, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 7 2026: పెద్దమందడి మండలంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం నుంచి పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) విద్యను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు మండల విద్యాధికారి మంజులత తెలిపారు. ఈ మేరకు ఆయా మరియు ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం కానున్న పాఠశాలలు ప్రాథమిక పాఠశాల పెద్దమందడి, ప్రాథమిక పాఠశాల మోజర్ల, ప్రాథమికోన్నత పాఠశాల అమ్మపల్లి, ప్రాథమిక పాఠశాల గట్లఖనాపూర్ అని తెలిపారు. ఆయా పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక మహిళలు, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్ (10+2) ఉత్తీర్ణులైన స్థానిక మహిళలు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాధికారి కార్యాలయం (ఎంఆర్సీ), పెద్దమందడిలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నాలుగు సంవత్సరాలు, మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాల వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని చెప్పారు. డిప్లొమా ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, నర్సరీ టీచింగ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (నర్సరీ) వంటి అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు మరియు ఇతర అవసరమైన పత్రాల ప్రతులను జతపరచాలని సూచించారు. ధ్రువీకరణ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని మండల విద్యాధికారి మంజులత తెలిపారు.