POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 7:35 pm Posted by : POLITICAL POWER

పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామికి ఘన సన్మానం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 09 2026: పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… పార్టీ బలోపేతానికి మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్టూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి వెల్టూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, వడ్డే శేఖర్, మద్దూరు నరసింహ, 7వ వార్డు సభ్యుడు దిండు నాగరాజు, మన్నెంకొండ ఎం.డి. సాదిక్, ఎం. వెంకటయ్య, గొర్రె విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.