POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 7:02 pm Posted by : POLITICAL POWER

పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం నర్సంపేటలోని ఆయన నివాసానికి వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలకు అంకితభావంతో సేవలందించిన నాయకుడని బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గత శాసనసభలో తాము కలిసి పనిచేశామని మాజీ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. పెద్ది ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.