POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 8:09 pm Posted by : POLITICAL POWER

పెబ్బేరు మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోళ్లలో తరుగు నిలిపివేయాలని రైతుల డిమాండ్

పెబ్బేరు మార్కెట్ యార్డులో వడ్ల కాంటాలు ప్రారంభించి, ఎలాంటి తరుగు తీసుకోకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ యార్డును సందర్శించి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

పెబ్బేరు పట్టణంలోని సాయి గోపాల ఇండస్ట్రీస్‌లో వడ్ల కొనుగోలు సమయంలో ప్రతి క్వింటాల్‌కు సుమారు 6 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే ఈ విధానాన్ని అరికట్టి న్యాయమైన కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు బుసిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, కౌన్సిలర్లు కరుణశ్రీ, సౌజన్య, శంకర్ నాయుడు, మన్యం, సీనియర్ నాయకులు కర్రె స్వామి, ఎల్లారెడ్డి, విశ్వరూపం, శేఖర్ గౌడ్, సహదేవుడు, సాయి తదితరులు పాల్గొన్నారు.