పెబ్బేరు మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోళ్లలో తరుగు నిలిపివేయాలని రైతుల డిమాండ్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: పెబ్బేరు మార్కెట్ యార్డులో వడ్ల కాంటాలు ప్రారంభించి, ఎలాంటి తరుగు తీసుకోకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ యార్డును సందర్శించి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. పెబ్బేరు పట్టణంలోని సాయి గోపాల ఇండస్ట్రీస్‌లో వడ్ల కొనుగోలు సమయంలో ప్రతి క్వింటాల్‌కు సుమారు 6 కిలోల వరకు తరుగు తీస్తున్నారని...