పేదలకు ఉచిత కంటి వైద్యం అందించడం అభినందనీయం:మెచ్చా
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ పవర్,అశ్వారావుపేట,అక్టోబర్ 21: పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్య హాస్పిటల్లో లయన్ వైరా కంటి ఆసుపత్రి సౌజన్యంతో, లయన్స్ క్లబ్ అశ్వారావుపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందుతున్న వారిని మెచ్చా నాగేశ్వరరావు...