వైయస్‌ఆర్ పథకాలు నేటికీ పేదలకు అండగా నిలుస్తున్నాయి: మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం అనపర్తి కెనాల్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి నేటికీ ప్రజల మనస్సుల్లో, ముఖ్యంగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన 108 అత్యవసర సేవలు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని గుర్తు చేశారు.
రాజశేఖర్ రెడ్డి చూపిన ముందుచూపు, పేదల సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచల నిబద్ధత కారణంగానే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ప్రజలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయని అన్నారు.
వైయస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో సంక్షేమ కార్యక్రమాలకు మరిన్ని నూతన పథకాలను జోడించి పేద, బడుగు, బలహీన వర్గాలకు విశేష సేవలు అందించారని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
ఘనంగా నివాళులు

వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), అనపర్తి టౌన్ అధ్యక్షుడు నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ వారా కుమారి, సత్తి వెంకట రామారెడ్డి, ఎంపీటీసీలు కరెడ్ల దాసు, బండారు శ్రీనివాసరావు, కొండేటి భీమేష్, తుమ్మ సత్యనారాయణ, వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి, సత్తి గంగిరెడ్డి, కోణాల సత్యనారాయణ రెడ్డి, శాంతి, మాదాబత్తుల శంకర్‌బాబు, మణికంఠ, భగవాన్, కానూరి కృష్ణ, వాసంశెట్టి వెంకట్రావు, సత్తి శ్రీనివాసరెడ్డి, కాదా దుర్గారావు, చింత రామారావు, ధర్మారెడ్డి, రామారెడ్డి, ఇబ్రహీం, రవి, ప్రవీణ్, మాజీ వార్డు సభ్యుడు సుమన్, యాసిడ్ రాము, తిరగటి శివ, మల్లేశ్వరరావు, సునీల్, ఏసు, వెంకటరెడ్డి, శ్రీను, జాఫర్, చింతా రామారెడ్డి, బంగారం, వీరయ్య కాపు, సోమరాజు, పోతారెడ్డి, సుబ్రహ్మణ్యం, నాయిబ్ రసూల్, లాల్ సాహెబ్, బాబురావు, వీర్రాజు, గోవిందు, దొరబాబు, బుల్లి వెంకటరెడ్డి, సూర్యనారాయణ, మణికంఠస్వామి, నాగేశ్వరరావు, దుర్గారావు, రెడ్డి వెంకటరెడ్డి, సత్తిరెడ్డి, భగవాన్, ఏసు, వెంకటరెడ్డి (అబ్బు), ప్రకాష్, సందీప్‌తో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.