పేదల ప్రాణాల కోసం రక్తదానం చేసిన నూతి సత్యనారాయణ గౌడ్, కిలారు అనిల్ కుమార్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 15 2026: తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమం సేవా భావానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ కుమార్ స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు....